![]() |
![]() |

బుల్లితెర ఆడియన్స్ కి ప్రియాంక సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్‌లో కమెడియన్‌గా ఎన్నో స్కిట్స్ చేసిన పింకీ.. బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారిన సంగతి తెలిసిందే. సాయితేజగా ఒకప్పుడు జబర్దస్త్‌లో స్కిట్స్ చేసిన ఇతను లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా ట్రాన్స్ఫర్మ్ అయ్యింది . అయితే తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం తల్లిదండ్రులకి కూడా చెప్పలేదు పింకీ. చాలా కాలం పాటు ఈ విషయాన్ని దాచే ఉంచింది. కానీ బిగ్‌బాస్ సీజన్ 5లో చెప్పి ఎమోషనల్ అయ్యింది. అలాంటి ప్రియాంక ఇప్పుడు తన బాడీని స్టిఫ్ గా మార్చుకునే పనిలో పడింది. జిమ్ కి వెళ్లి రకరకాల వర్కౌట్స్ చేస్తోంది.
ఈ మధ్య కాలంలో జెంట్స్ కంటే లేడీస్ అందులోనూ సెలెబ్రిటీస్ ఎక్కువగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రియాంక సింగ్ కూడా చేస్తోంది అదే. ఇక ఈ జిమ్ వీడియో చూసిన సిరి హన్మంత్ "గో గర్ల్" అంటూ మెసేజ్ పెట్టింది. ఇక మిగతా నెటిజన్స్ ఐతే "ప్రియాంక ఇంకా ముందుకెళ్ళేలా చూసుకో..కష్టపడు..ముందు మంచి రోజులు ఉన్నాయి. మంచి పని చేస్తున్నావ్..గుడ్ వర్క్. ఎక్సర్సైజు నెమ్మదిగా చేయండి. అబ్బాయ్ లా చేయకండి...అమ్మయిగారు సూపర్..మీరు జిమ్ చేసి ఇండియాకి గోల్డ్ కప్ తెస్తావని నాకు తెలుసు..ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ బాడీని గుడ్ షేప్ లో ఉంచుకోవడం కోసం చాల కష్టపడుతున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

![]() |
![]() |